ఢిల్లీలో పొత్తుపై  తేల్చాల్సింది ఆప్‌: కాంగ్రెస్‌ 

AAP to take decision on alliance in Delhi: Congress - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయాన్ని తేల్చాల్సింది ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ మాత్రమేనని, ఇప్పుడు బంతి ఆప్‌ కోర్టులో ఉందని కాంగ్రెస్‌ తెలిపింది. తాము పొత్తుకు సుముఖత వ్యక్తం చేశామని, ఆప్‌కు 4, కాంగ్రెస్‌కు 3 చొప్పున సీట్లు కేటాయించేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుర్జేవాలా వెల్లడించారు. ఈ విషయమై తమ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. ఆప్‌ తో పొత్తు ఢిల్లీలో మాత్రమే ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో ఉండదని తెలిపారు. అయితే, పొత్తుపై కేజ్రీవాల్‌ యూ టర్న్‌ తీసుకున్నారని రాహుల్‌గాంధీ సోమవారం ఒక ఎన్నికల బహిరంగసభలో ఆరోపించారు. ఆప్‌ కు 5, కాంగ్రెస్‌కు 2 చొప్పున సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు తాము సిద్ధమని ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆప్‌కు నాలుగు ఎంపీలున్నా ఒక్క స్థానం కూడా కేటాయించేందుకు కాంగ్రెస్‌ ముందుకు రాలేదని, ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా లేకున్నా మూడు స్థానాలు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top