ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పై తలెత్తిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పై తలెత్తిన అవినీతి ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది. 48 గంటల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ క్రికెట్ బాడీలో పెద్ద మొత్తంలో అవినీతి చోటుచేసుకుందని, అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్యానెల్ వేసింది.