విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌ | AAD interceptor missile test a success | Sakshi
Sakshi News home page

విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌

Mar 3 2017 1:56 AM | Updated on Aug 21 2018 9:33 PM

విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌ - Sakshi

విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్‌

సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించడంలో భారత్‌ మరో ముందడుగు వేసింది.

న్యూఢిల్లీ: సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించడంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. ప్రాజెక్టు 75 ద్వారా నిర్మించిన స్కార్పియో తరగతి కల్వరి జలాంతర్గామి నుంచి తొలిసారి నావికా దళం ప్రయోగించిన నౌక విధ్వంసక క్షిపణి.. ఉపరితలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిం చింది. ఈ మేరకు రక్షణ శాఖ గురువారం ప్రయోగం వివరాలు వెల్లడించింది. ‘ ఈ క్షిపణి ఆవిష్కరణతో మరో మైలురాయిని అధిగమించాం.

తాజా ప్రయోగంతో నావికాదళం ఉపరితల రక్షణ సామర్థ్యం పెరిగింది’ అని పేర్కొంది. సముద్ర ఉపరితల ప్రమాదాలను ఎదుర్కోడానికి భారత్‌ వద్ద ఉన్న 6 డీజిల్‌/ఎలక్ట్రిక్‌ జలాంతర్గాముల్లో ఈ క్షిపణులను ప్రవేశపెడతామని వెల్లడించింది. భారత్‌లో నిర్మించిన స్కార్పియో తరగతికి చెందిన తొలి జలాంతర్గామి కల్వరిని ఫ్రెంచ్‌ నావికా రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ ఎస్‌ రూపొందించగా.. ముంబైలోని మజ్‌గావ్‌డక్‌లో నిర్మించారు. క్షిపణిని విజయ వంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement