కాలువలో పడిన కారు : 8 మంది మృతి | 8 killed as vehicle falls into drain | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన కారు : 8 మంది మృతి

Aug 28 2014 11:45 AM | Updated on Apr 3 2019 7:53 PM

జమ్మూ కాశ్మీర్ రామబన్ జిల్లాలో ఓ వాహనం కాలువలో పడింది.

జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రామబన్ జిల్లాలో ఓ వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మొత్తం 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం నచాలన - షేర్ బిబి ప్రాంతంలోని కాది - మోహీ వద్ద అదుపు తప్పి కాలువలో పడిందని చెప్పారు. కాలువ నుంచి కారును బయటకు తీసుకువచ్చేందు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement