పానిపట్లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం | 7 charred to death as fire breaks out in Panipat | Sakshi
Sakshi News home page

పానిపట్లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం

Nov 25 2016 9:27 PM | Updated on Sep 5 2018 9:47 PM

పానిపట్లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం - Sakshi

పానిపట్లో అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం

పానిపట్లోని కోహాడ్ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

చంఢీఘడ్(హరియాణ): పానిపట్లోని కోహాడ్ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుప్పట్ల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.

మృతులందరూ పరిశ్రమలో పని చేసే కూలీలుగా సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement