ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి | 6 Farmers Deceased In Truck Collision In UP | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు రైతులు మృతి

May 20 2020 10:05 AM | Updated on May 20 2020 10:11 AM

6 Farmers Deceased In Truck Collision In UP - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతవాలోని ఫ్రెండ్స్‌ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్‌ కాలేజీకి తరలించారు. 


ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement