breaking news
Etah district
-
వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు!
ట్విస్టులే ట్విస్టులు. క్రైమ్ సినిమాలకు మించిన మలుపులు. నిజజీవితంలోనూ ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలా అనిపించే క్రైమ్స్టోరీ ఒకటి తాజాగా యూపీలో వెలుగులోకి వచ్చింది. తన మైనర్ కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను చంపించేందుకు ఓ తల్లి ప్లాన్ వేసింది. కూతుర్ని చంపడానికి ఓ వ్యక్తికి డబ్బు ముట్టజెప్పింది. ఇంతకీ అతడెవరనేదే ఇక్కడ ట్విస్టు. అంతేకాదు మైనర్ బాలికను చంపడానికి ఆమె తల్లి నుంచి డబ్బు తీసుకుని అతడేం చేశాడనేది మరో ట్విస్టు.అసలేం జరిగింది?ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా జశ్రత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 6న ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలిని నయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ నివాసి అయిన అల్కా(35)గా గుర్తించారు. కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్కాను చంపిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో చిక్కుముడి వీడింది.తన 17 ఏళ్ల కూతురు ఎవరితోనో ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న అల్కా సీరియస్ అయింది. ఆమెను ఫారూఖాబాద్లోని తన పుట్టింటికి పంపించేసింది. అయితే కూతురు వ్యవహారంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫోన్లోనే ప్రేమికుడితో గంటల తరబడి మాట్లాడుతోందని, ఆమెను తీసుకెళ్లాలని పుట్టింటివారు అల్కాకు గట్టిగా చెప్పారు. దీంతో తన పరువు పోయిందని భావించిన అల్కా కోపంతో రగిలిపోయింది. కూతుర్ని చంపేందుకు సెప్టెంబర్ 27న సుభాష్ సింగ్(38) అనే వ్యక్తిని కలిసింది. తన కుమార్తెను హతమారిస్తే 50 వేల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసింది. అయితే తన కూతురు ప్రేమించిన వ్యక్తి సుభాషే అని ఆమెకు తెలియకపోవడం ఇక్కడ ట్విస్టు.చదవండి: చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్నఅవాక్కైన పోలీసులుసుభాష్ నేరుగా తన ప్రేయసి దగ్గరకు వెళ్లి జరిగిదంతా చెప్పి.. మరో ప్లాన్ వేశాడు. అల్కాను అడ్డుతొలగించుకుంటే తామిద్దం హాయిగా పెళ్లిచేసుకోవచ్చని ప్రియురాలితో చెప్పాడు. ప్రియుడి మాటలు నమ్మిన బాలిక సరే అంది. వీరిద్దరూ కలిసి పథకం ప్రకారం అల్కాను హత్య చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. అల్కాను తామే హత్య చేసినట్టు పోలీసులు ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. పాపం అల్కా.. కూతురిని చంపడానికి ప్రయత్నించి తానే హతమైంది. ఇక ఈ కేసులో ట్విస్టులు చూసి పోలీసులే ఆశ్చర్యపోవడం గమనార్హం. -
ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎతవాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. -
14 మంది ప్రాణం తీసిన నిద్రమత్తు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. 24 మందిపైగా గాయపడ్డారు. ఎతాహ్ జిల్లా సరాయ్ నీమ్ ప్రాంతం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మినీ బస్సు కాల్వలో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మృతులు ఆగ్రాకు చెందినవారుగా గుర్తించారు. పెళ్లికి ముందు జరిగే వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆగ్రాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. సాక్రౌలీ గ్రామం నుంచి ఆగ్రాకు వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.