సున్ని మిలిటెంట్ల ఆధీనంలో 40 మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇరాక్ మిలిటెంట్ల చెరలో 40 మంది భారతీయులు
Jun 18 2014 6:19 PM | Updated on May 28 2018 1:37 PM
న్యూఢిల్లీ: సున్ని మిలిటెంట్ల ఆధీనంలో 40 మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సున్ని మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న భారతీయులందరూ టర్కిష్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారని ప్రభుత్వం వివరాలను విదేశాంగ శాఖ అందించింది.
సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న భారతీయులు ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారని, వారంతా తారిఖ్ నూర్ అల్ హుడా అనే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు.
వారంతా కిడ్నాప్ కు గురయ్యారా అనే విషయంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదని.. వారంత ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వారన్నారు. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement