ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

Published Sun, May 10 2020 4:21 AM

4 Maoists and one police official killed in Chhattisgarh encounter - Sakshi

చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఎస్సై నేలకొరగగా నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్దోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలపై మావోయిస్టులు మాటు వేసి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై శ్యాంకిశోర్‌ శర్మను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు.

మృతి చెందిన మావోయిస్టులను కాంకేర్‌ డివిజినల్‌ కమిటీ సభ్యుడు అశోక్‌ రైను, ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణ నరేటి, ఎల్‌ఓఎస్‌ సభ్యులు సవితా సలామే, పర్మిలలుగా గుర్తించారు. వీరిలో అశోక్‌పై రూ.8 లక్షల రివార్డు, కృష్ణపై రూ.5 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ. లక్ష చొప్పన రివార్డు ఉన్నట్లు రాజ్‌నంద్‌గావ్‌ ఏఎస్‌పీ తెలిపారు. వీరికి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన పలు ఘటనలతో సంబంధముందన్నారు. ఏకే–47 రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, రెండు 12–బోర్‌ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
Advertisement