చావు బ్రతుకుల మధ్య వైద్యుడి కోసం..

3 Month Old Baby Struggling For Life Due To Neurosurgeon Quarantine In Agra - Sakshi

ఆగ్రా : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా అందరికీ సరైన వైద్యం అందటం లేదు. ఓ వైపు కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తుంటే.. మరో చోట సిబ్బంది కొరత. ఈ నేపథ్యంలో హైడ్రోసెఫాలస్‌తో బాధపడుతున్న ఓ మూడు నెలల ఆగ్రా చిన్నారి న్యూరోసర్జన్‌ కోసం చావు బ్రతుకుల మధ్య గత 8 రోజులుగా ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌, ఆగ్రాకు చెందిన పూజ, లవ్‌కేశ్‌ కుమార్‌లకు మార్చినెలలో ఓ కూతరు పుట్టింది. చిన్నారి హైడ్రోసెఫాలస్‌తో బాధపడుతోందని తెలుసుకున్న వారు ఏప్రిల్‌ 15న ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని న్యూరోసర్జన్‌ చిన్నారికి ఆపరేషన్‌ చేశాడు. (స్టేట్‌ హోంలో 57 మందికి కరోనా.. ఐదుగురికి గర్భం!)

పాప కోలుకోవటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొద్ది రోజల తర్వాత చిన్నారి తల వాయటం మొదలైంది. దీంతో జూన్‌ 14న మళ్లీ ఆసుపత్రి తీసుకొచ్చారు. తమ ఆసుపత్రిలో ఉన్న ఒక్క న్యూరోసర్జన్‌ క్వారంటైన్‌లో ఉన్నాడని, వైద్యం అందించలేమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో చావు బ్రతుకుల మధ్య ఆ చిన్నారి గత  ఎనిమిది రోజులుగా వైద్యుడి కోసం ఎదురు చూస్తోంది. దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. ‘‘ న్యూరోసర్జన్‌ క్వారంటైన్‌లో ఉన్నాడని ఆసుపత్రి వారు చెప్పారు. ఆపరేషన్‌ చేసినప్పటికి పాప బ్రతకదన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించేంత ఆర్థిక స్థోమత నాకు లేదు’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top