అస్సాంలో బోటు పల్టీ.. ముగ్గురి మృతి

3 dead, 11 missing in boat capsize in Brahmaputra - Sakshi

గువాహటి: అస్సాంలో ఘోర ప్రమాదం సంభవించింది. గువాహటి నుంచి దాదాపు 36 మందితో బ్రహ్మపుత్ర నది మీదుగా ఉత్తర గువాహటి నగరానికి వెళుతున్న నాటు పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు 10 మందిని రక్షించగా, మరో 12 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంజిన్‌ చెడిపోవడంతో నాటు పడవ సమీపంలోని ఓ రాయిని ఢీకొని పల్టీ కొట్టిందని కామరూప్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కమల్‌ కుమార్‌ తెలిపారు. ఈ పడవలో నిబంధనలకు విరుద్ధంగా 18 మోటార్‌సైకిళ్లను తీసుకెళ్తున్నారనీ, మొత్తం ప్రయాణికుల్లో 22 మందికే సరైన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం సోనోవాల్‌ విచారణకు ఆదేశించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top