బిహార్ బీజేపీ శాసన సభ్యులు ప్రభుత్వంపట్ల వినూత్న నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. తమకు బహుమతులుగా ఇచ్చిన మైక్రో వేవ్స్ను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు.
పాట్నా: బిహార్ బీజేపీ శాసన సభ్యులు ప్రభుత్వంపట్ల వినూత్న నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. తమకు బహుమతులుగా ఇచ్చిన మైక్రో వేవ్స్ను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు.
గత కొద్ది నెలలుగా బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్ర ఉపాధ్యాయులకు జీతభత్యాలు చెల్లించడం లేదని అందుకు నిరసనగా తాము మైక్రోవేవ్స్ వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నామని చెప్పారు. 'గత నాలుగు నెలలుగా లక్షలమంది పాఠశాల ఉపాధ్యాయులు జీతభత్యాలు లేకుండా ఉన్నారు. ప్రేమ్ కుమార్, మంగళ పాండే నేను గిఫ్ట్లను తిరిగి వెనక్కి ఇస్తున్నాం' అని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు.