రోజుల పాపపై అత్యాచారం.. పరిస్థితి విషమం | 28 day old baby allegedly raped in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

రోజుల పాపపై అత్యాచారం.. పరిస్థితి విషమం

Dec 7 2015 2:36 PM | Updated on Aug 14 2018 5:56 PM

రోజుల పాపపై అత్యాచారం.. పరిస్థితి విషమం - Sakshi

రోజుల పాపపై అత్యాచారం.. పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని అసిఫ్ నాగ్లా గ్రామంలో రోజుల పసిగుడ్డుపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు.

లక్నో: కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా  ఉత్తరప్రదేశ్‌లోని అసిఫ్ నాగ్లా గ్రామంలో రోజుల పసిగుడ్డుపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఆదివారం జరిగిన ఈ దారుణఘటనతో 28 రోజుల పసిపాప ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 
 
పాప తల్లిదండ్రులు స్థానిక  గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు  వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన  స్థానిక  యువకుడు నామినో (25) పసిపాప అనే విచక్షణ కోల్పోయి ఈ అఘాయిత్యానికి  ఒడిగట్టి, పారిపోయాడు. ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితిని గమనించి  వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుని కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ పంకజ్ పాండే తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పాప ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సైతం  ఆందోళన వ్యక్తం  చేసినట్టు తెలిపారు.మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement