రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్! | 23-yr-old girl gangraped in moving car | Sakshi
Sakshi News home page

రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్!

Sep 18 2014 8:31 AM | Updated on Sep 2 2017 1:32 PM

రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్!

రాజధానిలో యువతి గ్యాంగ్ రేప్!

దేశ రాజధానిలో మరో యువతి గ్యాంగ్ రేప్ కు గురైంది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో యువతి గ్యాంగ్ రేప్ కు గురైంది. యువతి స్నేహితుడు మరో ఇద్దరు మిత్రులతో కలిసి కదులుతున్న కారులోనే గ్యాంగ్ రేప్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఏరియాలో చోటు చేసుకుంది.ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
 
అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీలోని ఓ మహిళా కానిస్టేబుల్ కుమార్తె అని, కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి ఈఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవించిన తర్వాత  అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిపై సామూహిక అత్యారానికి పాల్పడి.. నెహ్రూ ప్లేస్ ఫ్లైఓవర్ వద్ద వదిలి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందిచారని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ కు గురైనట్టు వైద్య పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement