 
															రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం
జమ్ము కశ్మీర్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదంపూర్ జిల్లా మరోతి లో ఓ బస్సు అదుపు లోయలోకి పడిపోయిన ఘటనలో 20మంది దుర్మరణం చెందారు.
	జమ్ము:  జమ్ము కశ్మీర్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదంపూర్ జిల్లా మరోతి లో  ఓ  బస్సు అదుపు లోయలోకి పడిపోయిన ఘటనలో 20మంది దుర్మరణం చెందారు.  బస్సు జమ్ము నుంచి బద్రాస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి సురీందర్ గుప్త ఆధ్వర్యంలో  సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
