యూపీలో మరో దారుణం | 16-year-old raped by her neighbour in UP Bhaodhi, | Sakshi
Sakshi News home page

యూపీలో మరో దారుణం

Nov 7 2015 12:06 PM | Updated on Apr 7 2019 4:36 PM

ఉత్తర ప్రదేశ్ లోని బదోహిలో మరో దారుణం చోటు చేసుకుంది. బధౌని జిలా సర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై మరో టీనేజ్ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

లక్నో:  ఉత్తర ప్రదేశ్ లోని బదోహిలో మరో దారుణం చోటు చేసుకుంది. బధౌని  జిలా సర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16  ఏళ్ల బాలికపై  మరో టీనేజ్ కుర్రాడు అత్యాచారానికి  పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం  పనిమీద  బైటకు వెళ్లిన ఆ బాలికపై పొరుగున ఉండే  అతడు ఈ అఘాయిత్యం చేశాడు.  తల్లిదండ్రుల ఫిర్యాదు  మేరకు  కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ  సురేంద్ర  కుమార్ పాండే తెలిపారు.  బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించామని, నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement