బుజ్జిగాడు బాంబు పేల్చాడు | 10-year-old makes hoax blast call | Sakshi
Sakshi News home page

బుజ్జిగాడు బాంబు పేల్చాడు

Jun 20 2014 4:30 PM | Updated on Sep 2 2017 9:07 AM

ఆ పదేళ్ల కుర్రాడికి మన పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనిపించింది.

ఆ బుడుగు టీవీలో వస్తున్న షోని చూశాడు. అందులో హీరో 100 నంబర్ కి ఫోను చేసి రాబోయే బాంబు ప్రమాదం గురించి చెప్పాడు. తక్షణం పోలీసులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. అది చూసిన ఆ పదేళ్ల కుర్రాడికి మన పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనిపించింది.
అంతే... ఫోను తీసుకుని 100 కి డయల్ చేశాడు. మా ఇంటి దగ్గర ఉప్పుఫ్యాక్టరీ పక్కన బాంబు పేలిందని సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది? నిముషాల్లో పోలీసులు వచ్చేశారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ టీమ్ లు వచ్చాయి. హడావిడిగా అంతా వెతికితే బాంబు ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆరా తీస్తే పదేళ్ల బుడతడు ఫోన్ చేశాడని తెలిసింది.
'పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని టెస్ట్ చేశానంతే' అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి పేరు షమీమ్. ఈ సంఘటన కాన్పూర్ జిల్లాలోని రావత్ పూర్ లో జరిగింది.
అనవసరంగా హడావిడిపడ్డందుకు కోపం వచ్చినా పోలీసులు తల్లిదండ్రులను మందలించారు. పిల్లవాడిని మాత్రం వదిలేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement