కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. పోలీసు మృతి

1 killed, 3 injured in encounter in Kashmir's Batmaloo - Sakshi

శ్రీనగర్‌: జమ్మూలోని బటామలూ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక పోలీసు చనిపోగా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ సందర్భంగా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం వేకువజామున భద్రతా బలగాలు శ్రీనగర్‌లోని బటామలూ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై గ్రనేడ్‌ విసరడటంతోపాటు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుకుంటూ చీకట్లో పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు కూడా దీటుగా స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్వేజ్‌ అహ్మద్‌ అనే కానిస్టేబుల్‌ చనిపోగా ఇద్దరు పోలీసులు, ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. అయితే, పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోగలిగారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top