
పట్నా : ప్రతి భారతీయుడి పళ్లెంలో ఒక బిహార్ వంటకం ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ మేరకు తాము బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.1.55లక్షల కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ విధానం రూపొందించేందుకు తీర్మానించారు. ఈ మేరకు రోడ్డు మ్యాప్‌కు ఆమోదం తెలిపారు.
'నూతన వ్యవసాయ విధాన లక్ష్యం ప్రతి భారతీయుడి పళ్లెంలో ఒక బిహార్ వంటకాన్ని అందించడం. ఇందులో భాగంగా ఆహార భద్రత, పోషకాలను అందించడం, రైతుల ఆదాయం పెంచడం' వంటి అంశాలు తాజా రోడ్‌మ్యాప్‌లో భాగం అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ రోడ్ మ్యాప్‌లో ఒక్క వ్యవసాయాన్ని మాత్రమే కాకుండా పశుసంవర్ధకశాఖను, రెవెన్యూను, భూసంస్కరణలను, నీటి వనరులను, విద్యుత్‌శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి మొత్తం పన్నెండు అంశాలను చేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిని ఒకేసారి కాకుండా ఒక గొలుసు మాదిరిగా అమలుచేయనున్నట్లు తెలిపారు.