'విలువలు నిండిన ఫ్యామిలీ చిత్రాలు రావాలి' | Young filmmakers should make films on family values: Barjatya | Sakshi
Sakshi News home page

'విలువలు నిండిన ఫ్యామిలీ చిత్రాలు రావాలి'

Dec 14 2015 7:36 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఈ రోజుల్లో యువత కుటుంబ విలువలకు సంబంధించిన చిత్రాలపై దృష్టిసారించి రూపొందిస్తే బాగుంటుందని ప్రముఖ దర్శకుడు సూరజ్ బరజాత్య అన్నారు.

ముంబయి: ఈ రోజుల్లో యువత కుటుంబ విలువలకు సంబంధించిన చిత్రాలపై దృష్టిసారించి రూపొందిస్తే బాగుంటుందని ప్రముఖ దర్శకుడు సూరజ్ బరజాత్య అన్నారు. ' 1990లో మైనే ప్యార్ కియా చిత్రంతో మాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అప్పుడు నేను యువకుడిని. పైగా ఇండస్ట్రీకి కొత్త' అని ఆయన గుర్తు చేసుకున్నారు. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు 2015 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అనుభవాలు పంచుకున్నారు.

'ఈరోజుల్లో యువదర్శకులకు ఎంతో టాలెంట్ ఉంది. అందుకే వారు మరిన్ని మంచి చిత్రాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వచ్చే తరంవారికి మంచి కుటుంబ విలువలతో కూడిన చిత్రాలను అందించే బాధ్యత వారిదే' అని ఆయన అన్నారు. ఆయన తాజాగ రూపొందించిన చిత్రం ప్రేమ్ రతన్ దన్ పాయో ఈ ఏడాది బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నుంచి నాలుగు అవార్డు లను అందుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement