ఏలియన్ డ్యాన్స్.. పీక్స్‌కి చేరింది! | Yami Gautam Dance With Alien Video Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఏలియన్ డ్యాన్స్.. పీక్స్‌కి చేరింది!

Apr 6 2018 3:39 PM | Updated on Apr 3 2019 6:34 PM

Yami Gautam Dance With Alien Video Viral In Social Media - Sakshi

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండయితే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వాటిని అనుసరించేస్తున్నారు. ఈ మధ్య ఏలియన్ డ్యాన్స్ పేరిట ఓ వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఓ మ్యూజిక్ యాప్ సాయంతో సెలబ్రిటీలు ఆ వీడియోకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి యామీగౌతమ్ ఏలియన్‌తో డ్యాన్స్ చేశారు. ఓవైపు ఏలియన్ డ్యాన్స్ , మరోవైపు తన బృందంతో కలిసి యామీ లయబద్ధంగా ఆ వీడియోకు స్టెప్పులేశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 7.7 లక్షల మంది వీడియో వీక్షించగా, మరో లక్షమంది నెటిజన్లు లైక్‌ చేశారు. 

ఇక ఈ మధ్యే ఈ గ్రహంతర వాసి డాన్సులకు క్రికెటర్ రోహిత్ శర్మ, కమెడియన్ మలైకా దువా, నటి దివ్యాంక త్రిపాఠిలు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. వీరి వీడియోలకు విశేష స్పందన రావడంతో యామీ కూడా ట్రై చేశారు. ఫిట్‌నెస్‌ను చూపిస్తూ ఇటీవల ఆమె చేసిన విన్యాసాల వీడియో, ఫొటోల కంటే కూడా మ్యూజికల్ యాప్‌తో ఏలియన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 67 లక్షల మంది ఫాలోయర్లున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement