డిసెంబర్‌లో తెరపైకి యాక్కై | yakki movie starts in december | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో తెరపైకి యాక్కై

Nov 18 2016 1:40 AM | Updated on Sep 4 2017 8:22 PM

డిసెంబర్‌లో తెరపైకి యాక్కై

డిసెంబర్‌లో తెరపైకి యాక్కై

యాక్కై చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కుళందై వేలప్పన్ తెలిపారు.

యాక్కై చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కుళందై వేలప్పన్ తెలిపారు. యువ నటుడు కృష్ణ, స్వాతి జంటగా నటించిన చిత్రం యాక్కై. ప్రకాశ్‌రాజ్, జోకర్ చిత్రం ఫేమ్ గరు సోమసుందరం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ ఫిలిం పతాకంపై ముత్తుకుమార్ నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ యాక్షన్, సెంటిమెంట్, లవ్, రొమాన్‌‌స, కామెడీ వీటిలో ఏ అంశాలతో కూడిన కథ అరుునా దానికి మరింత మెరుగులు దిద్దేది సంగీతం అని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానన్నారు.

 అలాంటి అద్భుతమైన సంగీతాన్ని యువన్‌శంకర్‌రాజా తమ యాకై ్క చిత్రానికి అందిస్తున్నారని తెలిపారు. ఆయన సంగీతంలో నటుడు ధనుష్ పాడిన పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తోందన్నారు. ప్రస్తుతం యువన్‌శంకర్‌రాజా నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతున్నారని తెలిపారు.యాక్కై చిత్రానికి ఆయన సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు కుళందై వేలప్పన్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement