జీసెస్ మహిమలతో... | with jesus life story making a film by sudheer | Sakshi
Sakshi News home page

జీసెస్ మహిమలతో...

Jul 10 2014 12:07 AM | Updated on Sep 2 2017 10:03 AM

జీసెస్ మహిమలతో...

జీసెస్ మహిమలతో...

క్రీస్తు మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వాసి’. సుధీర్ నీరుడు ఈ చిత్రానికి దర్శకుడు. శేఖర్ నిర్మాత. సికింద్రాబాద్‌లోని క్రైస్తవ మతపెద్దల సమక్షంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేశారు.

క్రీస్తు మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వాసి’. సుధీర్ నీరుడు ఈ చిత్రానికి దర్శకుడు. శేఖర్ నిర్మాత. సికింద్రాబాద్‌లోని క్రైస్తవ మతపెద్దల సమక్షంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేశారు. ఫాదర్ బాలశౌరి, పాస్టర్ శ్యామ్‌కిషోర్ పాటల సీడీని ఆవిష్కరించారు. క్రైస్తవం గొప్పతనాన్ని తెలిపే సినిమాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఫాదర్ బాలశౌరి అన్నారు. ఆదర్శప్రాయంగా ఉండే ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన బాధ్యత అందరిదీ అని పాస్టర్ శ్యామ్‌కిషోర్ పేర్కొన్నారు. విశ్వాసం గొప్పతనాన్ని, బలాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో తీస్తున్న సినిమానే ఈ ‘విశ్వాసి’ అని నిర్మాత చెప్పారు.     ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని, సంగీతం: అద్దంకి రాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement