'కబాలి' విడుదల తేదీ ఇదే(నా) | Will Rajinikanth's Kabali release on July 29? | Sakshi
Sakshi News home page

'కబాలి' విడుదల తేదీ ఇదే(నా)

Jul 3 2016 7:42 PM | Updated on Aug 9 2018 7:30 PM

'కబాలి' విడుదల తేదీ ఇదే(నా) - Sakshi

'కబాలి' విడుదల తేదీ ఇదే(నా)

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది.

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం 'కబాలి' విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా విడుదల తేదీలు రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. వాయిదాలు పడుతూ వస్తున్న 'కబాలి' జూలై 29న ధియేటర్లలో సందడి చేయనున్నాడని తాజా సమాచారం. ఈ నెల 29న విడుదలకానున్నట్టు మలేసియాలో 'కబాలి' పోస్టర్లు దర్శనమిచ్చాయి. వీటిని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ ట్వీట్ చేశారు. దీంతో 29న సినిమా విడుదల కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. 'సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మలేసియాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినవ'ని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.  

జూన్ లోనే ఈ సినిమాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత జూలైకి వాయిదా పడింది. ఈ నెల 15నే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. మలాయ్ భాషలో అనువాద కార్యక్రమాలు జరిగినప్పుడు రజనీకాంత్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు లేకపోవడం కారణంగా ఆ భాషానువాద కార్యక్రమాలు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న విడుదల ఖాయమని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement