
నాని జెంటిల్‌మెన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కేరళ బ్యూటీ నివేదా థామస్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, నటిగానూ నిరూపించుకున్నారు నివేదా. ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా తిరిగి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.
పాత్ర నచ్చితేనే చేస్తానంటున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ చిన్న హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సక్సెస్‌ను, విమర్శకుల ప్రశంసలు అందకున్న శ్రీవిష్ణు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. శ్రీవిష్ణు, నివేదా కాంబినేషన్ సినిమాను వివేక్ ఆత్రేయ (మెంటల్‌మదిలో ఫేం) మరో డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.