ఇక పెళ్లికి రెడీ? | will nayanatara ready to marry? | Sakshi
Sakshi News home page

ఇక పెళ్లికి రెడీ?

Feb 12 2015 8:25 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఇక పెళ్లికి రెడీ? - Sakshi

ఇక పెళ్లికి రెడీ?

అదేం విచిత్రమో కానీ.. ఇక నయనతార కెరీర్ సాగడం కష్టమే అని పరిశ్రమలో కొంతమంది అనుకుంటున్న సమయంలో ఆమె కెరీర్ వేగం పుంజుకుంటుంది.

అదేం విచిత్రమో కానీ.. ఇక నయనతార కెరీర్ సాగడం కష్టమే అని పరిశ్రమలో కొంతమంది అనుకుంటున్న సమయంలో ఆమె కెరీర్ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేనప్పటికీ ఈ మలయాళ సుందరి తమిళంలో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘వృత్తిపరంగా ఇంత వైభవాన్ని చూస్తున్న మీరు.. వ్యక్తిగతంగా ఎప్పుడు సెటిల్ అవుతారు? పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? లేదా’ అనే ప్రశ్నలు ఈ మధ్య ఆమెకు ఎక్కువయ్యాయట.
 
 ఈ ప్రశ్నల ప్రభావమో లేక పెళ్లి చేసుకుని, చక్కగా స్థిరపడితే బాగుంటుందని నయనతారకు అనిపించిందో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోవాలని మాత్రం బలంగా నిర్ణయించుకున్నారట. తల్లితండ్రులు చూసే అబ్బాయినే పెళ్లాడాలని నయనతార అనుకుంటున్నారని భోగట్టా. ఈ విషయం గురించి ఇటీవల ఇంట్లో చర్చించారని సమాచారం. సినిమా పరిశ్రమతో సంబంధం లేని అబ్బాయిని చూడమని తల్లితండ్రులకు నయనతార విన్నవించుకున్నారట. మరి.. ఏ అబ్బాయితో నయనతారకు ముడి పెట్టి ఉందో కాలమే చెప్పాలి.

 


 

Advertisement
 
Advertisement
Advertisement