ఆ చానెల్‌పై క్రిమినల్‌ కేసులు వేస్తా: వర్మ | will file multiple cases on Tv 9 channel, tweets varma | Sakshi
Sakshi News home page

Feb 20 2018 10:42 AM | Updated on Feb 20 2018 2:32 PM

will file multiple cases on Tv 9 channel, tweets varma - Sakshi

సాక్షి, ముంబై: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఓ న్యూస్‌ చానెల్‌పై కన్నెర్ర జేశారు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్‌ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్‌లో తెలిపారు.

కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్‌లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్‌ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్‌ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సదరు చానెల్‌పై వర్మ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్నారు.

ఇటీవల వివాదాస్పద ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’  వెబ్‌సినిమా విషయంలో వర్మ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అడల్ట్‌ చిత్రంపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ సామాజిక కర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్‌ పోలీసులు మూడు గంటలపాటు విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement