దీక్ష పోరాటం

Wife Of Ram Movie First Look Poster Released - Sakshi

ఆమె పేరు దీక్ష. ఆమెకు ఒక సమస్య ఉందా? లేక ఆమే ఒక సమస్యా? అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’. మంచు లక్ష్మి టైటిల్‌ పాత్రలో విజయ్‌ యెలకంటి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటరై్టన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘‘దీక్ష జీవితంలో గుండెలు పగిలే సంఘటనలుంటాయి. ఒక న్యాయం కోసం తను చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు.

ఎవరికీ తనపై అభిప్రాయం ఏర్పరచుకునే చాన్స్‌ ఇవ్వదు. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. సమాజాన్ని ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో జూన్‌ 1న ట్రైలర్‌ని, అదే నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సామల భార్గవ్, సంగీతం: రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుహాసిని రాహుల్, సమర్పణ: కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top