సిగ్గుగా ఉంది! | Why Samantha Cried? | Sakshi
Sakshi News home page

సిగ్గుగా ఉంది!

Nov 22 2014 11:36 PM | Updated on Oct 19 2018 7:10 PM

సిగ్గుగా ఉంది! - Sakshi

సిగ్గుగా ఉంది!

ఇదొక కళాఖండం. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు సమాజానికి చాలా అవసరం’’ అని కథానాయిక సమంత అన్నారు.

 ‘‘ఇదొక కళాఖండం. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు సమాజానికి చాలా అవసరం’’ అని కథానాయిక సమంత అన్నారు. ఆమె చెబుతున్నది ‘నా బంగారు తల్లి’ చిత్రం గురించి. రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సమంత ‘ఇప్పటివరకు ఇలాంటి చిత్రంలో నటించనందుకు సిగ్గుగా ఉంది’ అని పేర్కొనడంతో పాటు, ఇది అందరూ చూడదగ్గ చిత్రం అని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెరరూపం ఇస్తే, ఆర్ట్ సినిమాలా ఉంటుందేమో అని ఎక్కువమంది చూడరు. అందరికీ ఈ సందేశం చేరాలనే నా వంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నా. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. అయితే ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిటైర్ అయ్యేలోపు ఇలాంటిది ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement