ఆ వార్త నేనూ విన్నా

Who is Rajinikanth's next heroine? - Sakshi

తెలుగు అమ్మాయి అంజలి సౌత్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారామె. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కథానాయికగా అంజలి పేరు వినిపించింది. ఈ విషయాన్ని కోలీవుడ్‌ మీడియా ఆమె దగ్గర ప్రస్తావించగా.. ‘‘రజనీకాంత్‌గారి సినిమాలో నేను నటించనున్నాన్న వార్తలను విన్నాను. కానీ, ఆ విషయం గురించి ఇప్పుడేం మాట్లాడను’’అని చెప్పారు. మరి.. అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ వస్తే కానీ హీరోయిన్‌ విషయంలో క్లారిటీ రాదు. అంతేకాదు... నటుడు జై తో మీ రిలేషన్‌షిప్‌ ఏంటి? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘ఉయ్‌ ఆర్‌ గుడ్‌ ఫ్రెండ్స్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top