ఖైదీతో బాహుబలి | When Baahubali star Prabhas, SS Rajamouli paid a surprise visit to Chiranjeevi's Khaidi No 150 set | Sakshi
Sakshi News home page

ఖైదీతో బాహుబలి

Oct 21 2016 11:22 PM | Updated on Jul 14 2019 4:05 PM

ఖైదీతో బాహుబలి - Sakshi

ఖైదీతో బాహుబలి

ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్. ఇద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వేళ పక్కనే రాజమౌళి చిరునవ్వులు చిందిస్తున్న వేళ

ఒకరు మెగాస్టార్.. ఇంకొకరు యంగ్ రెబల్ స్టార్. ఇద్దరూ ఆత్మీయంగా కలుసుకున్న వేళ పక్కనే రాజమౌళి చిరునవ్వులు చిందిస్తున్న వేళ.. ఈవేళ ఏ వేళ అయ్యుంటుందా? అని ఆలోచించడం మొదలుపెట్టేశారా? మరేం లేదు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నం. 150’, ప్రభాస్ ‘బాహుబలి 2’ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో జరిగాయి.

రెండు సినిమాల షూటింగ్ లొకేషన్ దగ్గర దగ్గరే కావడంతో ఈ స్టార్స్ ఇద్దరూ మీట్ అయ్యారు. షాట్ గ్యాప్‌లో ‘ఖైదీ నం. 150’ లొకేషన్‌కి వెళ్లిన ప్రభాస్, రాజమౌళీలను చిరంజీవి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ టైమ్‌లో క్లిక్‌మన్న ఫొటో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement