ప్రేమలో ఏబీసి ఏంటి..? | What do mean by premalo abc ? | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఏబీసి ఏంటి..?

May 12 2014 10:46 PM | Updated on Sep 2 2017 7:16 AM

ప్రేమలో ఏబీసి ఏంటి..?

ప్రేమలో ఏబీసి ఏంటి..?

అజయ్, రిషి, రూబీ పరిహార్, శ్రీఐరా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసి’. తలారి నాగరాజు దర్శకుడు. జె.వి.రెడ్డి నిర్మాత.

అజయ్, రిషి, రూబీ పరిహార్, శ్రీఐరా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసి’. తలారి నాగరాజు దర్శకుడు. జె.వి.రెడ్డి నిర్మాత. ఏలేందర్ బైగళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య, మల్టీడైమన్షన్ వాసు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది.
 
 వి.సముద్ర, అశోక్‌కుమార్, స్టీవెన్ శంకర్, రామసత్యనారాయణ, డార్లింగ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్ ఇదని, నెలాఖరున సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు వచ్చే లాభాలను తన అమ్మానాన్నల పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి ఉపయోగిస్తానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఇ.ఎస్.హెచ్.ప్రసాద్.
 

Advertisement
 
Advertisement
Advertisement