ఆత్మహత్యలకు కారణం ఏంటి?  | What causes suicide? | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యలకు కారణం ఏంటి? 

Feb 11 2019 2:48 AM | Updated on Feb 11 2019 2:48 AM

What causes suicide? - Sakshi

శ్రీనాథ్, హరిత జంటగా నటించిన చిత్రం ‘మిర్రర్‌’. ‘సీ యువర్‌ సెల్ఫ్‌’ అనేది ఉప శీర్షిక. ఏక్మా సాయికుమార్‌ దర్శకత్వంలో శ్రీ మల్లికార్జున మూవీస్‌ సంస్థ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏక్మా సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది.   ప్రజలకు ఉపయోగపడే ఇతివృత్తంతో రాసుకున్న కథ ఇది.

ఒక ఊరిలో వరుసగా యువతీ యువకుల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటికి కారణం ఏంటని అన్వేషిస్తూ సాగే కథాంశమిది. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే కొందరి వ్యక్తుల అసాంఘిక శక్తుల అసలు రూపాన్ని ఈ చిత్రం బయటపెడుతుంది. త్వరలో పాటలు, మార్చి చివరి వారంలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: ఎన్‌. అర్జున్, కెమెరా: కె అశోక్, సహ నిర్మాతలు: డి. లక్ష్మీ నారాయణ, తూమ్కుంట అరుణ్, నీలం అశోక్, వినోద్‌ రాజ్‌.  

Advertisement
 
Advertisement
Advertisement