పదిమందికి సాయపడితే.... | Welcome Zindagi FirstLook Motion Poster | Sakshi
Sakshi News home page

పదిమందికి సాయపడితే....

Dec 2 2018 3:27 AM | Updated on Dec 2 2018 3:27 AM

Welcome Zindagi FirstLook Motion Poster - Sakshi

శ్రీనివాస్‌ కళ్యాణ్, పొద్దార్‌

చుట్టూ ఉన్న పదిమందికి సాయపడితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనందమే వేరు...! ఇదే కాన్సెప్ట్‌తో ఓ చిత్రం రానుంది. శ్రీనివాస్‌ కళ్యాణ్, పొద్దార్‌లను హీరో హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ పిల్లర్‌ 9 పతాకంపై నిర్మితమవు తోన్న మొదటి చిత్రం ‘వెల్‌కమ్‌ జిందగీ’. శాలు–లక్ష్మణ్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా దర్శకులు శాలు–లక్ష్మణ్‌లు మాట్లాడుతూ– ‘‘సాయం గురించి మాట్లాడే సినిమా ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా మా చిత్రం రాబోతోంది. హీరో,హీరోయిన్ల్‌ కొత్తవారైనా చక్కగా నటించారు. మధుమణి, కమల్‌ కీలక పాత్రలు పోషించారు. జబర్ధస్త్‌ ఫేమ్‌ కొమరం హీరో ఫ్రెండ్‌గా నటించారు. తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటాడు. చిత్రంలో ఐదు పాటలుంటాయి. గౌతమ్‌ రవిరామ్‌ మంచి సంగీతం అందించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటు న్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement