కాబోయే భర్తకు ధన్యవాదాలు | Wedding bells chime soon for Nayanathara and Vignesh | Sakshi
Sakshi News home page

కాబోయే భర్తకు ధన్యవాదాలు

Mar 25 2018 12:18 AM | Updated on Mar 25 2018 10:22 AM

Wedding bells chime soon for Nayanathara and Vignesh - Sakshi

విఘ్నేశ్‌ శివన్‌తో నయనతార

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే. కలిసి ఫారిన్‌ ట్రిప్స్‌కి వెళ్లడం,  అక్కడ దిగిన సెల్ఫీలను విఘ్నేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడం, బర్త్‌డేలను, పండగలను బాగా సెలబ్రేట్‌ చేసుకోవడం... ఈ సెలబ్రేషన్స్‌ వీళ్లు ఎంత క్లోజో తెలియజేస్తున్నాయి. కానీ ఇద్దరూ తమ ప్రేమ గురించి ఎక్కడా పెదవి విప్పలేదు.

అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో అవార్డు తీసుకున్న నయనతార ‘‘నన్ను ఎల్లవేళలా సపోర్ట్‌ చేస్తున్న అమ్మా, నాన్న, సోదరుడు అలాగే నా ఫియాన్సీ వీళ్లందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. నయనతార ఫియాన్సీ ఎవరో కాదు.. ‘విఘ్నేష్‌ శివన్‌’. ఇప్పటివరకూ రిలేషన్‌షిప్‌ గురించి నోరు విప్పని నయన డైరెక్ట్‌గా ఫియాన్సీ అన్నారంటే.. త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటారేమో.

Advertisement
 
Advertisement
Advertisement