బాక్సాఫీస్‌పై తాన్హాజీ దండయాత్ర | Warrior Tanhaji Roars At Box Office | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌పై తాన్హాజీ దండయాత్ర

Published Mon, Feb 3 2020 2:10 PM | Last Updated on Mon, Feb 3 2020 2:10 PM

Warrior Tanhaji Roars At Box Office - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అజయ్‌ దేవగన్‌ తాజా బ్లాక్‌బస్టర్‌తో జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన తాన్హాజీ బాక్సాఫీస్‌ వద్ద దూకుడు కొనసాగిస్తూ ఇప్పటికే రూ 250 కోట్ల వసూళ్లతో అదరగొడుతోంది. తాన్హాజీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఇంకా హౌస్‌ఫుల్‌ బోర్డులతో దర్శనమిస్తుండటంతో ఈ మూవీ లైఫ్‌టైమ్‌ వసూళ్లు రికార్డు స్ధాయిలో ఉంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురైన తాన్హాజీ బాక్సాఫీస్‌ దూకుడు కొనసాగుతోందని, నాలుగో వారంలో రూ 275 కోట్ల మార్క్‌ దాటుతుందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. 2020లో రూ 250 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్‌ మూవీ తాన్హాజీ కావడం గమనార్హం.

చదవండి : ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement