బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ | VV Vinayak Speech At Dhamki Teaser Launch | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

Sep 7 2019 3:08 AM | Updated on Sep 7 2019 3:08 AM

VV Vinayak Speech At Dhamki Teaser Launch - Sakshi

ఏనుగంటి, సత్యనారాయణ, వినాయక్, రజిత్, రామ్‌ సుంకర

‘బాక్సాఫీస్‌ బద్దలయ్యేలాగా ఓ కత్తిలాంటి కథ చెబుతాను గురువుగారు’ అనే డైలాగ్‌తో విడుదలైన ‘ధమ్కీ’ టీజర్‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆదిలక్ష్మి, భాస్కరరావు సమర్పణలో సుంకర బ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మించారు. ఈ సినిమా టీజర్, బ్యానర్‌ లోగోను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సుంకర బ్రదర్స్‌ మా కుటుంబానికి కావాల్సిన వారు. వాళ్ల తమ్ముడికి మంచి లైఫ్‌ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ బేనర్‌ని స్థాపించారు.

కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా సుంకర బ్రదర్స్‌ బేనర్‌కి మంచి ఫౌండేషన్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాను’’ అన్నారు ఏనుగంటి.  ‘‘సుంకర బ్రదర్స్‌ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్‌ చాలా బాగుంది. తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు రజిత్‌.  ‘‘మా బేనర్‌లో ‘ధమ్కీ’ లాంటి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుంకర బ్రదర్స్‌ అభిలాష్‌. ఫైట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర పాల్గొన్నారు. శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దీపక్‌ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement