విశ్వక్‌ కార్టూన్‌

vishwaksena cartoon movie launch - Sakshi

‘ఈ నగరానికి ఏమైంది’లో సైకో వివేక్‌ పాత్రలో ఆకట్టుకున్నారు యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌. లేటెస్ట్‌గా ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంలో హీరోగా నటించారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారు. నూతన దర్శకుడు ప్రదీప్‌ పులివర్తి దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా ఓ చిత్రం ఆదివారం ప్రారంభం అయింది. ఆర్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై విశ్వనాథ్‌ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘కార్టూన్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. డిఫరెంట్‌ జానర్‌లో ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూన్‌ 3న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: ఉదయ్‌ గుర్రాల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top