పాగల్‌ ప్రారంభం | Vishwak Sen Paagal Movie Launch | Sakshi
Sakshi News home page

పాగల్‌ ప్రారంభం

Mar 20 2020 12:14 AM | Updated on Mar 20 2020 12:14 AM

Vishwak Sen Paagal Movie Launch - Sakshi

‘దిల్‌’ రాజు, బెక్కం వేణుగోపాల్, విశ్వక్‌ సేన్, రానా, నరేష్‌

‘హిట్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పాగల్‌’. ఈ చిత్రం ద్వారా నరేష్‌ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విశ్వక్‌సేన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా హీరో రానా దగ్గుబాటి క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్‌’ రాజు స్క్రిప్ట్‌ని సినిమా యూనిట్‌కు అందజేశారు. బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘విశ్వక్‌తో ‘పాగల్‌’ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

ఒక క్రేజీ సబ్జెక్టుతో ఈ చిత్రం తీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూళ్లను ప్లాన్‌ చేస్తాం. నరేష్‌ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నరేష్‌ చెప్పిన స్క్రిప్ట్‌ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో ‘పాగల్‌’ చిత్రాన్ని అంగీకరించా. సరికొత్త జానర్‌లో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్‌సేన్‌. ‘‘టైటిల్‌ని బట్టి ఇది యాక్షన్‌ సినిమానా? అని అడుగుతున్నారు. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు నరేష్‌ కుప్పిలి. సంగీత దర్శకుడు రథన్, కెమెరామేన్‌ మణికంద¯Œ , ఎడిటర్‌ గ్యారీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌ లతా తరుణ్‌ తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement