అయితే నాకేంటి? | Vishal, Tamanna Kathi Sandai audio on 29th | Sakshi
Sakshi News home page

అయితే నాకేంటి?

Aug 27 2016 1:39 AM | Updated on Sep 4 2017 11:01 AM

అయితే నాకేంటి?

అయితే నాకేంటి?

అవకాశవాదం అన్నది అన్నిచోట్లా ఉన్నా చిత్ర పరిశ్రమలోనే ఇంకొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.

అవకాశవాదం అన్నది అన్నిచోట్లా ఉన్నా చిత్ర పరిశ్రమలోనే ఇంకొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఏరు దాటేవరకూ మల్లన్న, దాటిన తరువాత బోడిమల్లన్న అన్న సామెతను నిజం చే సేలా కొందరి ప్రవర్తన ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నటి నయనతార తాను ఒప్పుకున్న పాత్రలో నటించడం వరకే తన డ్యూటీ అన్నంతగా ప్రవ ర్తిస్తారు. చిత్రాలకు సంబంధించిన ఎలాంటి ప్రచారానికి రానని నిక్కచ్చిగా చెప్పేస్తారు. ఏం అంటే అది నా పాలసీ అనే సమాధానం ఆమె నుంచి వస్తుంది. నయనతార బాణీనే మిల్కీబ్యూటీ తమన్నా పాటిస్తున్నారనిపిస్తోంది.
 
  అయితే కాస్త భిన్నంగా..చిత్ర ప్రచారానికి రానని నయనతార చెబితే, తమన్నా మాత్రం నాకేంటి అంటున్నారట. బాహుబలి చిత్రం తరువాత అవకాశాలు బాగా పెరగడంతో ఈ అన్నీ పెంచేస్తున్నారనే ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం తమన్నా విశాల్‌కు జంటగా కత్తిసండై చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మద్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ ఇప్పుడు విక్రమ్‌ప్రభు, షామిలి జంటగా వీరశివాజీ చిత్రాన్ని నిర్మించారు.
 
 ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా మరో పక్క విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా కత్తిసండై చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వడివేలు, సూరి తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విశాల్, తమన్నా కలిసి నటిస్తున్న తొలి చిత్రం కాబట్టి దర్శక నిర్మాతలు నటి తమన్నాను చిత్ర ప్రచారానికి బాగా వాడుకోవాలని భావిస్తున్నారు.
 
  కాగా ఈ నెల 29న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమన్నాను ఆహ్వానించగా తాను ప్రచార కార్యక్రమాలలో పాల్గొననని ఖరాఖండీగా చెప్పారట. ఇదే విధంగా తను నటించిన ధర్మదురై చిత్ర సక్సెస్ మీట్‌కు పిలవగా వస్తే నాకేంటి? అన్న ధోరణిలో మాట్లాడినట్లు, అధనంగా పారితోషికం ఇస్తేనే వస్తానని అన్నారట. దీంతో ఆ చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్ కార్యక్రమాన్నే విరమించుకోవలసి వచ్చిందని తెలిసింది. అందుకే తమన్నా మీకిది తగునా అంటున్నాయి చిత్ర వర్గాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement