విశాల్‌ కొత్త చిత్రం ప్రారంభం | Vishal And Rashi Khanna New Movie Opening | Sakshi
Sakshi News home page

Aug 23 2018 4:10 PM | Updated on Aug 23 2018 4:49 PM

Vishal And Rashi Khanna New Movie Opening - Sakshi

విశాల్ ‘అభిమన్యుడు’తో తిరుగులేని హిట్‌ కొట్టాడు. డబ్బింగ్‌ సినిమాగా రిలీజైనా కూడా.. ఒక స్ట్రెయిట్‌ సినిమాలా కలెక్షన్లను కొల్లగొట్టింది. డిటెక్టివ్‌, అభిమన్యుడు సినిమాలతో విజయం సాధించిన విశాల్‌.. పందెంకోడి 2తో హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 

విశాల్‌ పందెంకోడి2 షూటింగ్‌ను ఇటీవలె పూర్తి చేసుకుని ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించేశాడు. తాజాగా తన తదుపరి చిత్రం షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పూరి జగన్నాథ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘టెంపర్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అయోగ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు విశాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement