ఆన్‌లైన్‌లో కచేరి

Virtual concert by artists worldwide - Sakshi

సాధారణంగా కాన్సర్ట్‌ అంటే వేల మంది జనం, భారీ మ్యూజిక్, పెద్ద గ్రౌండ్‌లో  ఏర్పాటు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా డిజిటల్‌ కాన్సర్ట్‌ (ఆన్‌ లైన్‌ లోనే కాన్సర్ట్‌)ను  ప్లాన్‌  చేశారు హాలీవుడ్‌ సింగర్‌ లేడీ గాగా. ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపేందుకే ‘వన్‌ వరల్డ్‌: టుగెదర్‌ ఎట్‌ హోమ్‌’ పేరుతో ఈ డిజిటల్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేశారు. ఎవరింట్లో వారు ఉండి ఆన్‌ లైన్లోనే ఈ సంగీత కచేరీని వీక్షించవచ్చు. 

ఏప్రిల్‌ 18న జరిగే ఈ కాన్సర్ట్‌ కరోనాపై  పోరాటానికి ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌. ఈ ప్రోగ్రామ్‌లో హాలీవుడ్‌ టాప్‌ సింగర్స్‌ జెన్నీఫర్‌ లోపెజ్, ఆడమ్‌ లాంబెర్ట్, ఓప్రా విన్‌ ఫ్రె, టేలర్‌ స్విఫ్ట్‌ వంటి ప్రఖ్యాత సింగర్స్‌ పాల్గొననున్నారు. మన దేశం నుంచి షారుక్‌ ఖాన్, ప్రియాంకా చోప్రా కూడా ఈ కార్యక్రమంలో  పాల్గొంటున్నారు. లేడీ గాగా యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం ముందు వరుసలో  పోరాడుతున్న ఆరోగ్య శాఖ వారికి గౌరవంగా ఈ కాన్సర్ట్‌లో నేను కూడా భాగం అవుతున్నాను’’ అని పేర్కొన్నారు షారుక్‌ ఖాన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top