మంచు ఫ్యామిలీకి న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ | Viranica Manchu Blessed with Baby Boy | Sakshi
Sakshi News home page

Jan 1 2018 8:12 PM | Updated on Jan 1 2018 8:17 PM

Viranica Manchu Blessed with Baby Boy - Sakshi

సాక్షి, సినిమా : కొత్త సంవత్సరం రోజున మంచువారి ఇంట సందడి నెలకొంది. మోహన్‌బాబు తనయుడు-నటుడు అయిన విష్ణు భార్య విరానికా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం అందుతోంది. కాగా, నెల‌లు నిండ‌డంతో విరానికాను హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లిన‌ట్టు ఈరోజు మధ్యాహ్నం విష్ణు ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ‘‘మా కుటుంబంలోకి మ‌రో వ్య‌క్తికి ఆహ్వానం ప‌లికే సమ‌యం వ‌చ్చేసింది. ఇప్పుడే హాస్పిట‌ల్‌కు వ‌చ్చాం. చాలా ఉత్కంఠ‌గా ఉంది’’ అని విష్ణు ట్వీట్ చేశాడు. ఆ దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇక వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు అని మంచు విష్ణు ఓ ట్వీట్‌ ద్వారా కొందరికి కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విష్ణుకు మగబిడ్డ పుట్టినట్లు బీఏ రాజు తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement