వస్తాడయ్యో సామి | Vikram-starrer 'Saamy Square' to release on September 20 | Sakshi
Sakshi News home page

వస్తాడయ్యో సామి

Sep 8 2018 1:02 AM | Updated on Sep 8 2018 1:02 AM

Vikram-starrer 'Saamy Square' to release on September 20 - Sakshi

‘భరత్‌ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామి’ పాటను తప్పుగా రాశామనుకుంటున్నారా? అదేం కాదు. పదిహేనేళ్ల కిందట తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘సామి’ సీక్వెల్‌ ‘సామి స్క్వేర్‌’ గురించి చెప్పబోతున్నాం. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్‌ రూపొందించారు  చిత్రదర్శకుడు హరి. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ పేరుతో సెప్టెంబర్‌ మూడో వారంలో రిలీజ్‌ కానుంది.

తమిళ్‌లో శిబు థామీన్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్‌.జి. ఔరా సినిమాస్‌ బ్యానర్స్‌లో బెల్లం రామకృష్ణా రెడ్డి, కావ్య వేణుగోపాల్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘హరి, విక్రమ్‌లది పవర్‌ఫుల్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సీక్వెల్‌పై క్రేజ్‌ పెరగడానికి అదో కారణమైతే ‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తీ సురేశ్‌ నటించిన సినిమా కావటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement