‘నువ్‌ ఆడుకున్నది నాతో కాదు.. యముడితో’

Vikram Starrer Mister KK Movie Trailer - Sakshi

చియాన్ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మిస్టర్‌ కెకె’. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజేష్‌ ఎం సెల్వ దర్శకుడు. తమిళ్‌లో కదరం కొండెన్‌ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో మిస్టర్‌ కెకె పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్‌ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.

ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు అక్షర హాసన్‌, అబి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top