కోల్‌కతాలో కోబ్రా

Vikram New Movie Cobra Shooting Start In Kolkata - Sakshi

విలక్షణ పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్‌ ఇప్పుడు ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ చేస్తే బరువు పెరగడం, తగ్గడం వంటివన్నీ చేసే విక్రమ్‌ ఈ సినిమా కోసం సన్నబడ్డారని టాక్‌. ఈ సినిమాలో హీరో పాత్రకు, కోబ్రాకు ఓ లింక్‌ ఉంటుందని, అదేంటో స్క్రీన్‌ మీద చూస్తేనే బాగుంటుందని చిత్రదర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు అన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది.  ఇది నాలుగో షెడ్యూల్‌. ఆ తర్వాత ఐదో షెడ్యూల్‌ను యూరోప్‌లో మొదలుపెట్టనున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. క్రికెటర్‌గా గ్రౌండ్‌లో చెలరేగిపోయిన ఇర్ఫాన్‌కి ఇది తొలి సినిమా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top