విజయ్‌ @ 80 లక్షలు | vijaydevarakonda fan following @ 80 lakhs | Sakshi
Sakshi News home page

విజయ్‌ @ 80 లక్షలు

Jul 17 2020 1:23 AM | Updated on Jul 17 2020 1:23 AM

vijaydevarakonda fan following @ 80 lakhs - Sakshi

హీరో విజయ్‌ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటన, స్టైల్, డిఫరెంట్‌ యాటిట్యూడ్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్‌ మీడియాలో విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించుకొని సౌత్‌లోనే నంబర్‌ వన్‌ హీరోగా నిలిచారు. తమ అభిమాన హీరో 80 లక్షల మార్కుకి చేరుకోవడంతో విజయ్‌ ఫ్యా¯Œ ్స ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. విజయ్‌కి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన నటించిన ‘అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలు హిందీలో డబ్‌ కావడంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ చేస్తున్న ‘ఫైటర్‌’ (టైటిల్‌ మారే అవకాశం ఉంది) ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు విజయ్‌ దేవరకొండ.

Advertisement
 
Advertisement
Advertisement