సేనాధిపతి రాజాపాండీ | Vijay Sethupathi Sye Raa Narasimha Reddy Motion Poster | Sakshi
Sakshi News home page

సేనాధిపతి రాజాపాండీ

Jan 17 2019 12:31 AM | Updated on Jan 17 2019 12:31 AM

Vijay Sethupathi Sye Raa Narasimha Reddy Motion Poster - Sakshi

విజయ్‌ సేతుపతి

ప్రస్తుతం తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్న హీరో విజయ్‌ సేతుపతి. రీసెంట్‌గా రజనీకాంత్‌ ‘పేట్టా’లో కూడా కనిపించారు. ఇప్పుడీ హీరో చిరంజీవి నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నిన్న విజయ్‌ సేతుపతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సైరా’ సినిమాలో ఆయన  పోషిస్తున్న ‘రాజా పాండీ’ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో తమిళ సైన్యానికి సేనాధిపతిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement