పేరుతో సినిమా | vijay sethupathi released on november 15 | Sakshi
Sakshi News home page

పేరుతో సినిమా

Nov 5 2019 12:13 AM | Updated on Nov 5 2019 12:13 AM

vijay sethupathi released on november 15 - Sakshi

రాశీ ఖన్నా, విజయ్‌ సేతుపతి

తమిళంలో హిట్‌ సినిమా మీద హిట్‌ సినిమా చేస్తూ అక్కడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు హీరో విజయ్‌ సేతుపతి. ఇటీవల విడుదలైన ‘సైరా’ చిత్రంలో పాండిరాజ్‌ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు తమిళ్‌లో ‘సంఘ తమిళన్‌’గా, తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’గా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్‌ వారు నిర్మించగా, తెలుగులో హర్షితా మూవీస్‌పై రావూరి. వి.శ్రీనివాస్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి విజయ చందర్‌ దర్శకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘విజయ్‌ సేతుపతి’ సినిమాను తెలుగులో విడుదల చేయటం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ జరపబోతున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement