ఆయనకు ఇద్దరు!

Vijay Sethupathi New Movie With Raashi Khanna And Nivetha Pethuraj - Sakshi

తమిళసినిమా: విజయాలు ఇష్టపడుతున్న నటుడు విజయ్‌సేతుపతి అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఇమేజ్‌ అనే చట్రంలో ఇరుక్కోకుండా నటనకు ఆస్కారం ఉందనుకుంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న ఈయన హీరో ఇమేజ్‌కు మాత్రం ఎలాంటి డ్యామేజ్‌ కలగకపోవడం విశేషం. మణిరత్నం తెరకెక్కించిన సెక్క సివంద వానం చిత్రంలో చాలా ఇన్నోసెంట్‌ యువకుడిగా నటించి చివరలో తనే హీరో అనిపించుకోవడంలో విజయం సాధించాడు. ఇటీవల రజనీకాంత్‌నే ఢీకొనే పాత్రను పేట చిత్రంలో నటించి తన సత్తా చాటుకున్నాడు. అయినా విజయ్‌సేతుపతి చేతిలో కథానాయకుడిగా పలు చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ఆయన కనుసైగ కోసం ఎదురుచూస్తున్నాయి. మక్కల్‌ సెల్వన్‌ అని అభిమానులిచ్చిన బిరుదుకు న్యాయం చేసేలా తన సినీ పయనాన్ని సాగిస్తున్న విజయ్‌సేతుపతి నటించిన సూపర్‌డీలక్స్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

ఇందులో అందాలభామ సమంత నాయకి. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఇందులో విజయ్‌సేతుపతి హిజ్రాగా కొన్ని సన్నివేశాల్లో కనిపించనుండడం విశేషం. ఇక ఇటీవలే సింధుబాద్‌ అనే చిత్రం ప్రారంభమైంది. ఇందులో అంజలి నాయకి. ఎస్‌.అరుణ్‌కుమార్‌ దర్శకుడు. ఇక తను గురువుగా భావించే సీనూరామస్వామి దర్శకత్వంలో మామనిదన్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయనతో నటి గాయత్రి రొమాన్స్‌ చేస్తోంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్‌లో నటించే అవకాశం విజయ్‌సేతుపతిని వరించింది. ఈ ఎంజీఆర్, రజనీకాంత్, కమలహాసన్, విజయ్, విశాల్‌ వంటి స్టార్స్‌ నటించిన బ్యానర్‌ ఇది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ సింగిల్‌ హీరోయిన్‌తోనే సరిపెట్టుకున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకరు నటి రాశీఖన్నా, మరొకరు నివేదాపేతురాజ్‌ అని సమాచారం. ఇకపోతే హాస్యనటుడు సూరి మరోసారి విజయ్‌సేతుపతితో కలిసి హాస్యాన్ని పండించబోతున్నాడు. ఈ చిత్రాన్ని విజయ్‌చందర్‌ తెరకెక్కించనున్నారు. ఈయన ఇంతకు ముందు శింబు హీరోగా వాలు, విక్రమ్‌ హీరోగా స్కెచ్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top